కెనడాలో ఫెంటానిల్ మరియు మెథాంఫేటమిన్ తయారీ మరియు పంపిణీ చేస్తున్న అత్యంత పెద్ద మరియు ఆధునిక సూపర్-ల్యాబ్‌ను రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ (RCMP) బస్టు చేసింది. ఫెంటనిల్‌తో కూడిన నిషేధిత డ్రగ్‌లు కెనడాలో 2016 జనవరి నుండి 2024 మార్చి వరకు 48,000 మంది ప్రాణాలు కోల్పోయేలా చేశాయి.
పోలీస్ బృందం బ్రిటీష్ కొలంబియాలోని ఫాల్క్‌లాండ్‌లో ఉన్న ల్యాబ్‌తో పాటు ఇతర ప్రాంతాల్లోనూ సోదాలు జరిపి సుమారు 54 కిలోల ఫెంటనిల్, 390 కిలోల మెథాంఫెటమైన్, తక్కువ పరిమాణంలో కోకైన్, ఎండీఎంఏ మరియు గంజాయిని స్వాధీనం చేసుకుంది. అదేవిధంగా, 89 ఆయుధాలు, ఏఆర్-15 రైఫిల్స్, సబ్‌మెషిన్ గన్స్, ఎక్స్‌ప్లోసివ్ పరికరాలు, బాడీ ఆర్మర్ మరియు సుమారు $500,000 నగదు కూడా స్వాధీనం చేసుకుంది.
ఆపరేషన్‌లో భాగంగా గగన్‌ప్రీత్ రంధావా అనే వ్యక్తిని అరెస్ట్ చేసి, ఆయుధాలు మరియు డ్రగ్‌లకు సంబంధించిన అనేక నేరాలకు అతనిపై అభియోగాలు మోపారు. ఫెంటనిల్ మరియు మెథాంఫెటమైన్ వంటి శక్తివంతమైన కెమికల్స్ మానవ ఆరోగ్యానికి హానికరమైనవని RCMP అధికారులు తెలిపారు. ఈ సూపర్-ల్యాబ్, మెక్సికన్ కార్టెల్ పద్దతుల్లో తయారీ చేస్తూ వున్నట్లు గుర్తించారు, ఇది పశ్చిమ కెనడాలో ఇదివరకెన్నడూ చూడలేదు.
Recent Comments