ఏపీ రాజధాని పైన వైసీపీ ప్రభుత్వంపై సవాలు విసిరిన టీడీపీ అధినేత చంద్రబాబు 48 గంటల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసం నుంచి బుధవారం ఆన్‌లైన్‌లో పత్రికా విలేకరులతో మాట్లాడుతూ నేను విసిరిన సవాల్‌కు వైసీపీ నేతలు స్పందించకుండా పారిపోయారన్నారు.
ఆదేవిధంగా అమరావతి రాజధాని పై కేంద్రం జోక్యం చేసుకోవాలని, రైతుల యెక్క నమ్మకాన్ని కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉందని చంద్రబాబు చెప్పారు. విద్యుత్తు కొనుగోళ్ల విషయంలో కేంద్రం జోక్యం చేసుకుని ఎలా ఐతే రాష్ట్రానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారో అలాగే అమరావతి రాజధాని అశంపైన కేంద్రం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేసారు.
రాజధాని రైతుల కోసం క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ నుంచి కేంద్రం మినహాయింపునిచ్చిందని, రాజధాని నిర్మాణం కోసం కేంద్రం నిధులు ఇచ్చిందన్నారు. రాబోయే రోజుల్లో పోరాటాన్ని విస్తృతం చేయాలని, ప్రజలందరిని కలిసి రావాలని
తమ అంతటా తాము వచ్చి అమరావతి పోరాటంలో పాల్గొనాలి అని పిలుపునిచ్చారు. హైకోర్టు ఏర్పాటుకు రాష్ట్రపతి ఆమోదంతో సుప్రీం కోర్టు చీఫ్ జస్టీస్ స్వయంగా శంకుస్థాపన చేశారని మరొకసారి గుర్తుచేశారు.
2014 అసెంబ్లీలో అప్పటి ప్రతిపక్షనేతగా జగన్ అమరావతి రాజధానిగా ఒప్పుకున్నారా? లేదా? అప్పుడు ఒప్పుకున్న జగన్ ఇప్పుడు దేనికి మూడు ముక్కలాట ఆడుతున్నాడు అని చంద్రబాబు వైస్ జగన్ ని విమర్శించాడు. ఈ మూడు ముక్కలాట గురించి ప్రజలకు ఎన్నికలకు ముందు దేనికి చెప్పకుండా ఇప్పుడు మాట తప్పడం, మడమ తిప్పడాన్ని అదే విధంగా దేనిని ప్రజలు నిలదీయాలా? వద్దా? అని ప్రజలను అడుగుతున్నానని అన్నారు చంద్రబాబు ఆన్‌లైన్‌లో పత్రికా విలేకరులతో మాట్లాడారు.
అమరావతిని ఇక్కడే ఎందుకు ఉండాలనే అంశం, అమరావతి ప్రాజెక్టుకులకి సంబందించిన అన్ని వివరాలతో మరో 48 గంటల తర్వాత మీడియా ముందుకు వస్తానన్నారు.
Leave a comment