హైదరాబాద్ నగరంలో నవంబర్ 28 వరకు ర్యాలీలు, ధర్నాలు, సభలపై నెల రోజులపాటు ఆంక్షలు విధించినట్లు పోలీసులు ప్రకటించారు. ఈ ఆంక్షలు అక్టోబర్ 27 సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభమయ్యి, నవంబర్ 28 సాయంత్రం 6 గంటల వరకు అమలులో ఉండనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు.
కేవలం ఇందిరా పార్క్‌లో మాత్రమే ధర్నాలకు అనుమతి
ఈ ఆంక్షల ప్రకారం, నగరంలో ప్రజా సమావేశాలు, ధర్నాలు, ర్యాలీలను పూర్తిగా నిషేధించారు. అయితే, శాంతియుత ధర్నాలు చేయాలనుకునే వారికి ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద మాత్రమే అనుమతి ఉంది. ఇందుకు ఇతర ప్రాంతాలలో ధర్నాలు, ర్యాలీలకు అనుమతి లేదు.
ప్రజా శాంతి భద్రతలు కాపాడడమే లక్ష్యం
పోలీసుల ప్రకటన ప్రకారం, నగరంలో కొన్ని సంఘాలు, రాజకీయ పార్టీలు శాంతి భద్రతలను దెబ్బతీసే విధంగా ర్యాలీలు, ధర్నాలు చేయడానికి ప్రయత్నిస్తున్నాయని, ఇది ప్రజా శాంతి భద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉందని పోలీసుల చే ముందస్తు సమాచారం అందినట్లు తెలిపింది. అందుకే శాంతి భద్రతల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
నిషేధిత చర్యలు
ఒక వ్యక్తి లేదా గ్రూపు వ్యక్తులు ఏవైనా ప్రసంగాలు, సంకేతాలు, జెండాలు, చిహ్నాలు, ఎలక్ట్రానిక్ సందేశాలు, నినాదాలు తదితరాలను ప్రదర్శించడం నిషేధం. ఇది శాంతి భద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉన్నందున, పోలీసులు ఎలాంటి ర్యాలీలకూ అనుమతి ఇవ్వడంలేదు.
అవసర సిబ్బందికి మినహాయింపు
ఈ ఆంక్షలు, పోలీసు అధికారులు, సైనిక సిబ్బంది విధుల్లో ఉన్న సమయంలో వారికి, సరైన అనుమతులతో చేసే కార్యకలాపాలకు మినహాయింపు ఉంటుందని తెలిపారు.
వివాదం
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఈ నిర్ణయంపై మండిపడుతూ, దీన్ని హిందువుల పండుగలపై కట్టుబడే ప్రయత్నంగా పేర్కొంది. బీజేపీ నాయకులు విశ్ను వర్థన్ రెడ్డి, శాంతికుమార్ లాంటి నాయకులు సోషల్ మీడియా వేదికగా దీన్ని విమర్శించారు.