Home General News & Current Affairs డ్రోన్ టెక్నాలజీతో వైద్య సేవల విప్లవం: మంగళగిరి ఎయిమ్స్‌లో ఆవిష్కరణ
General News & Current AffairsHealthPolitics & World Affairs

డ్రోన్ టెక్నాలజీతో వైద్య సేవల విప్లవం: మంగళగిరి ఎయిమ్స్‌లో ఆవిష్కరణ

Share
mangalagiri-aiims-drone-services
Share

సాంకేతికంగా ప్రపంచం దూసుకుపోతోంది. టెక్నాలజీ పరంగా అద్భుతాలు ఆవిష్కృతమవుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్సెస్ రంగాల్లో మనిషి రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాడు. అయితే ఈ టెక్నాలజీని ఆరోగ్య రంగంలో మిక్స్ చేసి.. అద్భుతాలు సృష్టించేందుకు కేంద్రం శ్రీకారం చుట్టింది. డ్రోన్ల ద్వారా ఆరోగ్య, సేవల రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చే దిశగా అడుగులు వేస్తోంది.

డ్రోన్ల ఉపయోగం వైద్య రంగంలో

ఇక విషయంలోకి వస్తే, డ్రోన్లు అంటే మనందరికీ ఠక్కున గుర్తొచ్చేది నిఘా. గణేష్ ఉత్సవాలు, జాతర్ల సమయంలో డ్రోన్లతో గస్తీ కాయటం చూస్తుంటాం. ఇటీవలి కాలంలో డ్రోన్ల ద్వారా కొన్నిచోట్ల డెలివరీ సేవలు కూడా ప్రారంభించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ, వైద్య రంగంలో డ్రోన్ల వినియోగం తక్కువగా ఉంది. అయితే, ఆరోగ్య రంగంలో డ్రోన్ల సేవలను ప్రారంభించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.

మంగళగిరి ఎయిమ్స్‌లో డ్రోన్ సేవలు

మంగళగిరి ఎయిమ్స్ ఆస్పత్రిలో డ్రోన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డ్రోన్ సేవలను మంగళవారం (అక్టోబర్ 29) ప్రారంభించారు. ఢిల్లీ నుంచి వర్చువల్‌గా జరిగిన కార్యక్రమంలో డ్రోన్ సేవలను ప్రారంభించారు. అనంతరం ఎయిమ్స్ అధికారులు డ్రోన్ సేవలను ప్రయోగాత్మకంగా పరిశీలించారు. అందులో భాగంగా, ఎయిమ్స్ నుంచి సుమారుగా 12 కిలోమీటర్ల దూరంలో ఉన్ననూతక్కి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి డ్రోన్‌ను పంపించారు. అక్కడ ఉన్న మహిళా రోగి నుంచి రక్త నమూనాను సేకరించిన తర్వాత, డ్రోన్ ద్వారా ఈ బ్లడ్ శాంపిల్‌ను ఎయిమ్స్ తీసుకువచ్చారు.

డ్రోన్ల ప్రయోజనాలు

  • అత్యవసర సేవలు: అత్యవసర పరిస్థితులలో రోగులకు సేవలు అందించడంలో వేగం పెరుగుతుంది.
  • సరళత: పెద్ద దూరాలను డ్రోన్‌ల ద్వారా వెంటనే చేరవేయడం.
  • అర్ధికంగా ప్రయోజనకరమైనది: సాఫల్యమూ, ఖర్చు తక్కువగా ఉంటుంది.
  • ప్రయోగాత్మకంగా: మొత్తం ఆరోగ్య వ్యవస్థకు అనుకూలంగా ఉండటంతో, గ్రామీణ ప్రాంతాలకు చేరుకోగలదు.

11 ఎయిమ్స్‌లలో ప్రారంభం

ఈ డ్రోన్ సేవలను దేశవ్యాప్తంగా మొత్తం 11 ఎయిమ్స్ లలో ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి ఎయిమ్స్, తెలంగాణలోని బీబీనగర్ ఎయిమ్స్, ఉత్తరాఖండ్ లోని రిషికేష్ ఎయిమ్స్, అస్సాంలోని గౌహతి ఎయిమ్స్, మధ్యప్రదేశ్ భోపాల్ ఎయిమ్స్, రాజస్థాన్ జోధ్ పూర్ ఎయిమ్స్, బిహార్ పాట్నా ఎయిమ్స్, హిమాచల్ ప్రదేశ్ బిలాస్‌పూర్ ఎయిమ్స్, యూపీలోని రాయ్ బరేలీ ఎయిమ్స్, ఛత్తీస్ ఘడ్‌లోని రాయ్‌పూర్ ఎయిమ్స్, మణిపూర్ ఇంఫాల్‌లోని రిమ్స్ ఆస్పత్రిలో డ్రోన్ సేవలను ప్రధాని ప్రారంభించారు.

మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్

మరోవైపు, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య రంగంలో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. అందులో భాగంగా, హైదరాబాద్, కాకినాడలో వైద్య పరికరాలు, బల్క్ డ్రగ్స్ ఉత్పత్తి చేయనున్నారు. ఈ ప్రాజెక్టులకు కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభోత్సవం చేశారు.

Share

Don't Miss

సూపర్ మార్కెట్లో చాక్లెట్‌ చోరీ.. 13 ఏళ్ల బాలుడిపై చిత్రహింసలు – పోలీసుల కేసు నమోదు

తెలంగాణలోని ఇబ్రహీంపట్నంలో ఒక హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఓ 13 ఏళ్ల బాలుడు సూపర్ మార్కెట్లో చాక్లెట్‌ చోరీ చేశాడనే కారణంతో డీమార్ట్‌ యజమానులు, సిబ్బంది అతడిని చిత్రహింసలకు గురి చేశారు....

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తతలు – విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్

హెచ్‌సీయూ నిరసన – పరిణామాలపై సమగ్ర విశ్లేషణ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) వద్ద కంచ గచ్చిబౌలి భూవివాదం నేపథ్యంగా విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. విద్యార్థులు, విద్యావేత్తలు కలిసి...

సంగారెడ్డి ముగ్గురు పిల్లల హత్య కేసు మిస్టరీ వీడింది – తల్లే హంతకురాలిగా నిర్ధారణ

ముగ్గురు పిల్లల అనుమానాస్పద మృతి తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ ప్రాంతంలో ముగ్గురు చిన్నారులు అనుమానాస్పద స్థితిలో మరణించిన సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. మొదట ఈ మరణాల వెనుక...

వక్ఫ్ చట్ట సవరణ బిల్లు: లోక్‌సభలో పెద్ద చర్చ, ఎన్డీఏ-ఇండియా కూటముల వ్యూహాలు!

వక్ఫ్‌ బోర్డు చట్టసవరణ బిల్లు (Waqf Bill) బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లుపై రాజకీయ పార్టీల మధ్య తీవ్ర చర్చ జరుగుతోంది. ఎన్డీఏ (NDA) మిత్రపక్షాలు పూర్తి మద్దతు ఇస్తున్నప్పటికీ,...

అనకాపల్లి: వేపాడు దివ్య కేసులో సంచలన తీర్పు

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన వేపాడ దివ్య హత్య కేసు లో చోడవరం కోర్టు నిర్దేశించిన మరణశిక్ష తీర్పు చరిత్రలో నిలిచిపోనుంది. ఏడేళ్ల చిన్నారి వేపాడ దివ్యను 2015లో దారుణంగా హత్య చేసిన...

Related Articles

సూపర్ మార్కెట్లో చాక్లెట్‌ చోరీ.. 13 ఏళ్ల బాలుడిపై చిత్రహింసలు – పోలీసుల కేసు నమోదు

తెలంగాణలోని ఇబ్రహీంపట్నంలో ఒక హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఓ 13 ఏళ్ల బాలుడు సూపర్ మార్కెట్లో...

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తతలు – విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్

హెచ్‌సీయూ నిరసన – పరిణామాలపై సమగ్ర విశ్లేషణ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) వద్ద కంచ...

సంగారెడ్డి ముగ్గురు పిల్లల హత్య కేసు మిస్టరీ వీడింది – తల్లే హంతకురాలిగా నిర్ధారణ

ముగ్గురు పిల్లల అనుమానాస్పద మృతి తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ ప్రాంతంలో ముగ్గురు చిన్నారులు అనుమానాస్పద...

వక్ఫ్ చట్ట సవరణ బిల్లు: లోక్‌సభలో పెద్ద చర్చ, ఎన్డీఏ-ఇండియా కూటముల వ్యూహాలు!

వక్ఫ్‌ బోర్డు చట్టసవరణ బిల్లు (Waqf Bill) బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లుపై రాజకీయ...