ఆంధ్రప్రదేశ్: హైకోర్టు న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు పెట్టిన వారికి ఉచ్చు బిగుస్తోంది. వీరిపై ఇప్పటికే సీఐడీ కేసులు నమోదు చేసింది. ఈ కేసును సీబీఐకు అప్పగించాలని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు తాజాగా సీబీఐ రంగంలోకి దిగింది. సీఐడీ నమోదు చేసిన కేసులను పరిశీలించింది. త్వరలో నిందితులను విచారించే అవకాశం ఉంది, కాగా హైకోర్టు జడ్జిలపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టింగ్స్ పెట్టిన 17 మందిపై సీఐడీ కేసులు నమోదు చేసింది. అయితే సీఐడీ దర్యాప్తుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సీబీఐ దర్యాప్తు చేయాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో 12 కేసులను సీబీఐ విశాఖలో రిజిస్టర్ చేసింది. ఈ కేసుల్లో డి. కొండారెడ్డి, ఎ.మణి, పి.సుధీర్, ఆదర్శరెడ్డి, అభిషేక్ రెడ్డి, శివారెడ్డి, ఎ.శ్రీధర్ రెడ్డి, జె.వెంకట సత్యనారాయణ. జి. శ్రీధర్ రెడ్డి, లింగారెడ్డి, చందూరెడ్డి, శ్రీనాధ్, డి.కిషోర్ రెడ్డి, చిరంజీవి, ఎల్. రాజశేఖర్ రెడ్డి, గౌతమీలపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.