ఆంధ్రప్రదేశ్: వైసీపీ ప్రభుత్వానికి హైకోర్టు మరోసారి షాక్ ఇచ్చింది. స్వరూపానందస్వామి జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించాలంటూ దేవాదాయశాఖ నుంచి దేవాలయాలు అన్నింటికి ప్రత్యేక ఆదేశాలు పంపించారు. శ్రీకుకుళం అరసవల్లి నుంచి చిత్తూరు కాళహస్తి వరకు అన్ని దేవాలయాల్లోనూ ఈ పూజలు నిర్వహించాలని ఆదేశాలిచ్చారు. అయితే చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి ఈ విషయంపై పిటిషన్ వేయగా.. విచారించిన న్యాయస్థానం ఇరువైపు వాదనలు విన్న అనంతరం మెమోను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు అడిగినమీదట తాము కూడా తమ లేఖను ఉపసంహరించుకుంటున్నట్లు స్వరూపానందస్వామి శారదాపీఠం తరఫు న్యాయవాది తెలిపారు. దీంతో హైకోర్టు కేసును మూసివేసింది.
Leave a comment