ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్రప్రదేశ్ కి రాష్ట్రపతి పాలన వస్తే బాగుంటది అని కోరుకుంటున్నారు. దేనికి అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయ సన్నాసి నాయకులు అందరు వాళ్ళ వాళ్ళ రాజకీయ లబ్ది కోసం మరియు వాళ్ళ రాజకీయ కక్షలు తీర్చుకునే పనిలో ఉన్నారు.
ఒకరేమో సింగపూర్ రాజధాని కడతాను అని బొక్కబోర్లా పడుకున్నారు. ఇంకోకరేమో మూడు రాజధానులు కడతాను అని అంటున్నారు. మరొకరేమో ప్రశ్నిస్తాను అని చెప్పి ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి. ఒక్కసారి ఏపీ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి, ఈ రాజకీయ నాయకులా మనకి సింగపూర్ రాజధాని మరియు మూడు రాజధానులు కట్టేది. ముందు ఆంధ్ర ప్రజల జీవనాడీ అయిన పోలవరం కట్టండిరా బాబు. అస్సలు ఆంధ్ర రాజకీయా నాయకులూ ఎంత పెద్ద సన్నాసులో చెప్పాలి అంటే, పోలవరం 1941 లో పోలవరం వద్ద జలాశయాన్ని నిర్మించాలని ప్రతిపాదించిన అంశాన్ని ఇంతవరకు పూర్తి చేయలేని సన్నాసులు వీళ్ళు సింగపూర్ రాజధాని కడతాను అని ఒకరు, ఇంకోకరేమో మూడు రాజధానులు కడతాను అని అంటున్నారు. ఇది అంతా చూస్తుంటే ఎవరో ఒక పెద్దయిన చెప్పిన సామెత గుర్తు వస్తుంది. (ఎదో చేయలేక మంగళవారం అన్నాడు అంట).
మంగళవారం పెద్దలారా కొంచెం ప్రజలకి ఉపయోగపడే వాటిని చేయండి. లేదు అంటే సింగపూర్ రాజధాని కడతాను అని బొక్కబోర్లా పడుకున్న అయిన గతే మీకు పడుతుంది.
Leave a comment