కరోనా మహమ్మారి బారినపడ్డ వైసీపీ ప్రజాప్రతినిధుల జాబితాలో ఎంపీ విజయసాయిరెడ్డి కూడా చేరారు. ఇప్పటికే పలువురు వైసీపీ ఎమ్మెల్యేలకు కరోనా సోకిన విషయం తెలిసిందే. తాజాగా, విజయసాయిరెడ్డికి కూడా కరోనా పాజిటివ్ అని తేలినట్టు తాజా సమాచారం.ఈ నేపథ్యంలో, విజయసాయి ట్విట్టర్ ద్వారా స్పందించారు. “కరోనా పరిస్థితుల దృష్ట్యా, నాకు నేనుగా వారం నుంచి 10 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలని నిర్ణయించుకున్నాను. ముందుజాగ్రత్త చర్యగా క్వారంటైన్ లో ఉండడం తప్పదు. టెలిఫోన్ లోనూ అందుబాటులో ఉండను.. ఏవైనా కొన్ని అత్యవసర విషయాలకు మాత్రమే సంప్రదించగలరు” అంటూ ట్వీట్ చేశారు.
ఏది ఏమైనా విజయసాయిరెడ్డి త్వరగా కోలుకోవాలని వైసీపీ శ్రేణులు మరియు ఇతర ప్రజా ప్రతినిధులు ట్విట్టర్ ద్వారా తెలిపారు.
Leave a comment