కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ ని ఆంధ్రా ప్రజల్ని రోడ్డుపై పడేసింది.
BJP రెండు నాల్కల ధోరణితో ఆంధ్రా కి మట్టిని ఇచ్చింది మరియు అదే రెండు నాల్కల ధోరణితో పవన్ కళ్యాణ్ ని ఏమి మాట్లాడకుండా చేసి ఇంట్లో కూర్చోబెట్టింది.
TDP స్ధోమతకు మించి అమరావతి కలలు కని బొక్క బోర్లా పడుకుంది,
YCP అమరావతే రాజధాని అని మాట మార్చి మడమ తిప్పారు. ప్రాంతాల వారీగా గొడవలు ఎలా పెట్టాలి మరియు కులాలని ఎలా రెచ్చగొట్టాలి అని ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు.
ఇంకా జనసేన పార్టీ ఉన్నదో లేదో, పవన్ కళ్యాణ్ తీరు అర్ధం కాక జనసైనికులు ఏమి చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.
గుంటూరు, కృష్ణ జిల్లాల నాయకులు వైసీపీ పార్టీ తొత్తులుగా మారిపోయారు.
ఏపీ ప్రజలు మాత్రం మరలా ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయి మనకి రెండు వేలు ఎప్పుడు వస్తాయి అని ఎదురుచూస్తున్నారు.
కొద్దో గొప్పో చదువుకున్న ప్రజలు ఆంధ్ర ని వదిలిపెట్టి వెళ్లి పోతున్నారు
ఇంకా చివరిగా మన తెలుగు న్యూస్ చానల్స్ తనదయిన రీతిలో వాళ్ళ జర్నలిజం (బ్రోకరిజం కాదు అండి సరిగా చుడండి మేము జర్నలిజం అని అంటున్నాము) కాపాడుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *