జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు క్షేత్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో జనసైనికులు, నాయకులు, NRI కార్యకర్తలు కోవిడ్ సమయంలో వివిధ సేవా కార్యక్రమాలలో క్రియాశీలకంగా పాల్గొన్నారు .
కరోనా క్లిష్టసమయం,ఊహించని విధంగా వరదలు వంటి ప్రతికూల పరిస్థితులు,స్థానికంగా అవాంతరాలు ఎదురైనా,జనసేన నాయకులు,కార్యకర్తలు ధృడ సంకల్పంతో ఉత్సాహంగా క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని దిగ్విజయవంతంగా చేపట్టారు.
పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మన జనసైనికులు ప్రభుత్వ ఆసుపత్రిలలో సుమారు 650 ఆక్సిజన్ కిట్స్ ఇచ్చారు.
చాలా అద్భుతంగా జనసేవ సహాయ చర్యలు అందించారు.పవన్ కళ్యాణ్ గారు అందరినీ ట్విట్టర్ వేదికగా అభినందించారు. వారికి అభినందనలు తెలియజేస్తున్నాను
—- జనసేన పార్టీ PAC చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు
Leave a comment